English | Telugu
విక్రమ్ మూవీ నుంచి ఐశ్వర్య ఔట్!
Updated : Jul 21, 2023
విక్రమ్ సినిమా ధ్రువ నక్షత్రం గురించి రోజుకో అప్‌డేట్ ఇస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. ఆ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ పార్ట్ ని తొలగిస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో నుంచి గతంలో ఒరు మనం అనే పాటను విడుదల చేశారు. దాదాపు మూడేళ్ల ముందు ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. ఇప్పుడు ఈ పాటను మేకర్స్ తమ యూట్యూబ్ చానెల్‌లో ప్రైవేట్‌లో పెట్టారు. టీజర్‌లో ఐశ్వర్య పేరును కాస్ట్ అండ్ క్రూ లిస్టులో అలాగే ఉంచారు. అయితే, ఇప్పుడు సెకండ్ సింగిల్‌లో హిస్ నేమ్ ఈజ్ జాన్‌లో... క్రెడిట్స్ లిస్టులో ఐశ్వర్య పేరు కనిపించడం లేదు.
అందువల్ల ఈ సినిమా నుంచి ఐశ్వర్య రాజేష్ పోర్షన్ తీసేస్తున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే దీని గురించి అధికారికంగా ఎవరూ స్పందించలేదు.
ధ్రువనక్షత్రం స్పై థ్రిల్లర్ సినిమా. విక్రమ్, రీతు వర్మ, పార్తిబన్, సిమ్రన్, దివ్యదర్శిని కీలక పాత్రల్లో నటించారు. చియాన్ విక్రమ్ ఈ చిత్రంలో జాన్ రోల్‌లో నటించారు. ఇందులో ఆయన నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటించారు. ఎడిటింగ్: ఆంటోని, ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొండాడువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. సినిమా రిలీజ్ డేట్‌ని ఇంకా అనౌన్స్ చేయలేదు మేకర్స్. ఇటీవల పాటను మాత్రం ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ విడుదల చేశారు.